తెలంగాణ · April 26, 2026

పుప్పాలగూడ అవోపా ఆధ్వర్యంలో ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్, మణికొండ, ఏప్రిల్ 26 (V90 NEWS): పుప్పాలగూడ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (AVOPA) ఆధ్వర్యంలో వాసవి మాత జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మణికొండ మర్రిచెట్టు సమీపంలోని శివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అవోపా సభ్యులు, స్థానిక ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలుపుప్పాలగూడ అవోపా శాఖ అధ్యక్షుడు దారం వేణుమాధవ్, కార్యదర్శి దారం భానుచందర్, కోశాధికారి అప్పని యుగంధర్ పర్యవేక్షణలో ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అమ్మవారి పటాన్ని భక్తిశ్రద్ధలతో ఊరేగించారు.శాస్త్రోక్తంగా గణేశ పూజ, వాసవి మాతకు కుంకుమార్చనలు నిర్వహించారు.అనంతరం విచ్చేసిన భక్తులకు మరియు అతిథులకు భారీగా అన్న ప్రసాద వితరణ గావించారు. వాసవి మాత జయంతిని రాష్ట్ర అధికారిక పండుగగా గుర్తించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇది ఆర్యవైశ్య సమాజానికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవమని వారు కొనియాడారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అవోపా రాష్ట్ర అధ్యక్షులు మల్లిపెద్ది శంకర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొడ్డు శ్రీధర్, కార్యదర్శి సాయిరాం పాల్గొన్నారు. అలాగే మహిళా విభాగం నుండి కార్యదర్శి చైతన్య, మణికొండ మహిళా విభాగ ప్రతినిధులు మహాలక్ష్మి, దేవి ప్రియ, స్నేహలతో పాటు శ్రావణ్, ప్రణీత్, నరేష్, రాము తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor