కరీంనగర్ · August 24, 2026

జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్

కరీంనగర్/హుజూరాబాద్,వి90 న్యూస్,ఆగస్టు 24: ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులకు పెద్దపీట వేస్తున్నామని, అర్హులైన ప్రతి జర్నలిస్టును ఆదుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ హామీ ఇచ్చారు. సోమవారం రోజున హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద నిర్వహించిన రిలే నిరాహారదీక్షల స్థలిని ఆయన సందర్శించి, దీక్షలో ఉన్న జర్నలిస్టులకు నిమ్మరసం ఇచ్చి వారి దీక్షలను విరమింపజేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అసంపూర్తిగా ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి మరల ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు కలగకుండా చూస్తామని, జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల విషయంలో పూర్తిస్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, పట్టణ , మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor