కరీంనగర్/హుజూరాబాద్,వి90 న్యూస్, ఆగస్టు 24: ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అందజేస్తూ, ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. ‘మన ఊరు-మన కాంగ్రెస్-మన ప్రణవ్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున హుజురాబాద్ మండల పరిధిలోని 16 గ్రామాల్లో 16 లక్షల రూపాయల విలువ చేసే 46 సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిధి) చెక్కులను ఆయన లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పంపిణీ చేశారు.

ఆపద సమయంలో తమను ఆదుకుంటున్నందుకు లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి , వొడితల ప్రణవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, నిరుపేద లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు కోసం మంత్రులు, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో ప్రజలు తెస్తున్న వివిధ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం పలు గ్రామాల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణాలను పరిశీలించడంతో పాటు, నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాలలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, జిల్లా అధికార ప్రతినిధులు, హుజురాబాద్ మండల అధ్యక్షుడు కొలుగూరి కిరణ్, సింగిల్ విండో చైర్మన్ సుగుణాకర్ రెడ్డిలతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

