కరీంనగర్ · August 24, 2026

జమ్మికుంటలో నివాసయోగ్యం లేని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 24: జమ్మికుంట పట్టణ పరిధిలోని కేశవపురం కస్తూరిబా పాఠశాల సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన 500 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో భాగమైన 240 ఇళ్లలో కేవలం 24 ఇళ్లు మాత్రమే నివాసయోగ్యంగా ఉన్నాయని, మిగిలినవన్నీ ఫౌండేషన్, పిల్లర్లు , వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

అసంపూర్తి నిర్మాణాల వల్ల మెటీరియల్ ధ్వంసమై ఇళ్లు శిథిలావస్థకు చేరుతున్నాయని, ప్రజాధనం వృథా కాకుండా జిల్లా కలెక్టర్, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిధులు కేటాయించిన తర్వాతే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రజలకు అబద్ధాలు చెప్పకుండా మౌలిక వసతులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శీలం శ్రీనివాస్, కొలుగురి సురేష్, ఫిరోజ్, మైస రవి, పరశురామ్, శంకర్, శివ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor