క్రైమ్ · August 25, 2026

పరువు కోసం కూతురిని దారుణంగా చంపించిన కన్నతండ్రి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ఎల్కతుర్తి కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యం కేసును ఛేదించిన పోలీసులు

కేసు వివరాలను వెల్లడించిన ఏసిపి ప్రశాంత్ రెడ్డి

హన్మకొండ/ఎల్కతుర్తి,వి90 న్యూస్,ఆగస్టు 25: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కలకలం రేపిన కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పెళ్లిళ్లకు సంబంధించి ఇబ్బందులు సృష్టిస్తోందన్న నెపంతో పరువు కోసం కన్నతండ్రే తన కుమార్తెను ప్రియుడితో దారుణంగా హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెద్దపల్లి జిల్లాకు చెందిన అంకతి మానస (33)కు గతంలో రెండుసార్లు వివాహమై విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో ఆమెకు తండ్రి స్నేహితుడి కుమారుడైన ఎల్కతుర్తికి చెందిన ఎడెళ్లి వినోద్ కుమార్ (33)తో సంబంధం ఏర్పడింది. తన్ను పెళ్లి చేసుకోవాలని మానస ఒత్తిడి తెస్తుండటంతో వినోద్ ఈ విషయాన్ని ఆమె తండ్రి రాజేశం దృష్టికి తీసుకెళ్లాడు. కూతురు ప్రవర్తనతో విసిగిపోయిన రాజేశం, ఆమె బతికుంటే మరింత ఇబ్బందని భావించి మానసను వదిలించుకోవాలని వినోద్‌ను ప్రోత్సహించాడు.తండ్రి మాటలతో ప్రేరణ పొందిన వినోద్ కుమార్, కరీంనగర్‌లోని తన అద్దె ఇంట్లో మానస గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి కారు డిక్కీలో వేసుకుని ఎల్కతుర్తి తీసుకొచ్చి, రోడ్డు పక్కన కారును వదిలేసి వెళ్లిపోయాడు. ఈ నెల 21న కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడు వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, హత్యకు ప్రేరేపించి పరారీలో ఉన్న తండ్రి రాజేశం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor