కరీంనగర్ · September 26, 2026

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం: బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 26: నైజాం నిరంకుశ పాలనకు, విస్నూర్ జమీందార్ రాంచంద్రారెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన విప్లవ ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ అని బిజెపి ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు కొనియాడారు. బిజెపి ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో జమ్మికుంటలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శతకోటి ప్రణామాలు అర్పించారు.


ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “నా భూమిపై నీ హక్కేంది?” అని నిలదీస్తూ భూస్వామ్య వ్యవస్థ గుండెల్లో నిప్పులు పోసిన ఐలమ్మ పోరాటం తెలంగాణకే గర్వకారణమని పేర్కొన్నారు. ఆమె ప్రదర్శించిన తెగువ, పోరాట పటిమ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు టంగుటూరి రాజ్ కుమార్, కైలాస కొట్టి గణేష్, రాచపల్లి ప్రశాంత్, గుర్రం పరుశురాములు, తూర్పాటి శంకర్, ఆకుల పోచయ్య, తిరుపతి, ఆడవాళ్ళ శ్రీధర్, అఖిల్, పసునూటి మల్లికార్జున్, తాటికంటి మల్లేష్, పనికిరా రమేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor