కరీంనగర్ · August 25, 2026

వావిలాల పిహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 25: జమ్మికుంట మండల పరిధిలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో పర్యటించిన ఆయన, రోగులకు అందుతున్న వైద్య సేవలు , మందుల సరఫరాపై ఆరా తీశారు. ఆసుపత్రి నిర్వహణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో, సంబంధిత వైద్యాధికారులు , సిబ్బంది తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్య , వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు వైద్యం అందించడంలో ఎలాంటి అలసత్వ వహించినా సహించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలు, సీఆర్వో నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో వావిలాల సర్పంచ్ అర్జున్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పరశురామారావు, నాయకులు పొనగంటి మల్లయ్య, సారంగపాణి, సజ్జు జమ్మికుంటతో పాటు పలువురు స్థానిక వావిలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor