కరీంనగర్ · August 29, 2026

జమ్మికుంటలో ఘనంగా అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్ఆగస్టు 29: టాలీవుడ్ ప్రముఖ నటుడు ‘కింగ్’ అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలోని అన్నపూర్ణ టాకీస్‌లో అభిమానుల కోలాహలం నడుమ ఘనంగా జరిగాయి. అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు డాన్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 8వ వార్డు కౌన్సిలర్ కొలుగూరి సురేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అభిమానులతో కలిసి కౌన్సిలర్ కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం డాన్ రమేష్ మాట్లాడుతూ, నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ‘విక్రమ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన నాగార్జున శివ, గీతాంజలి, నిన్నే పెళ్లాడుతా, అన్నమయ్య, మన్మథుడు, మనం, సోగ్గాడే చిన్నినాయనా వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని కొనియాడారు.

భవిష్యత్తులో కూడా ఆయన మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు రాజేష్‌తో పాటు చందు, శ్రీనివాస్, శ్రీకాంత్, వడ్లూరి సంపత్, వడ్లూరి శశి కుమార్, గుల్లి కుమార్ తదితర అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor