కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 29: ఆబాది జమ్మికుంట జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పదో తరగతి టాపర్లకు పూర్వ విద్యార్థులు నగదు పురస్కారాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ అధ్యక్షతన శనివారం నిర్వహించిన కార్యక్రమంలో, 2025-26 విద్యాసంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విద్యార్థులకు ఈ బహుమతులు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా ప్రథమ స్థానంలో నిలిచిన డొంకటి సాక్షితకు రూ. 5,000, ద్వితీయ స్థానంలో నిలిచిన దొడ్డే రణ వర్ధన్‌కు రూ. 3,000, తృతీయ స్థానంలో నిలిచిన మైస అక్షిత్‌కు రూ. 2,000 చొప్పున నగదు పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ పాఠశాల పూర్వ విద్యార్థులైన పింగళి వెంకటరెడ్డి, మార్క విజయ్ ప్రకాష్, డాక్టర్ కాటిపల్లి లింగారెడ్డి, అయిత శ్రీనివాస్, అమృత సురేష్‌లు 2015 నుంచి ప్రతి ఏటా ఈ ప్రతిభా పురస్కారాలను అందిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి అయిత శ్రీనివాస్ విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాన్ని అందించగా, డాక్టర్ లింగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు విద్యా అవసరాలకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేంద్ర కుమార్, కృష్ణమూర్తి, సృజన, రాజశ్రీ, దుర్గాప్రసాద్, స్థానిక కౌన్సిలర్ సుజాత, విద్యార్థుల తల్లిదండ్రులు కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

