కరీంనగర్ · August 30, 2026

హుజూరాబాద్‌లో ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడో మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజూరాబాద్,వి90 న్యూస్,ఆగస్టు 30: అఖిల భారత యువజన సమైక్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర మూడో మహాసభలను పురస్కరించుకుని హుజూరాబాద్ మండలం ఇందిరానగర్‌లో వాల్ పోస్టర్‌ను ప్రతినిధులు ఘనంగా ఆవిష్కరించారు. ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పోలోజు రంజిత్ కుమార్, హుజూరాబాద్ మండల అధ్యక్షురాలు చిట్టి లావణ్యల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పోలోజు రంజిత్ కుమార్, మండల అధ్యక్షురాలు చిట్టి లావణ్యలు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలు, విద్యా రంగంలో నెలకొన్న సవాళ్లు, ఉపాధి అవకాశాల కల్పన , యువజనుల రాజ్యాంగ బద్ధమైన హక్కుల సాధనే ధ్యేయంగా ఈ మూడో మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో యువతను మరింత చైతన్యపరిచి, వారి సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయడానికి ఈ మహాసభలు వేదిక కానున్నాయని వారు పునరుద్ఘాటించారు.కాబట్టి, హుజూరాబాద్ ప్రాంతంలోని యువకులు, విద్యార్థులు , సమైక్య శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడో మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు, ప్రతినిధులు గంగేటి సరళ, పెండాల లావణ్య, ప్రసాద్, చెలిక ప్రసాదు, సతీష్, రాజిరెడ్డి, రాజయ్యలతో పాటు స్థానిక యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor