కరీంనగర్ · August 30, 2026

పేదోడి సొంతింటి కలకు సర్పంచ్ అండ: ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తే.. సొంత డబ్బులతో ఉచితంగా నిర్మిస్తున్న నాయకుడు!

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్, ఆగస్టు 30: తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ఓ నిరుపేద యువకుడికి సొంతింటి కలను సాకారం చేసేందుకు గ్రామ సర్పంచ్ మానవత్వంతో ముందుకు వచ్చారు. ప్రభుత్వ సహకారంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించడమే కాకుండా, తన సొంత నిధులతో పూర్తి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు నిర్ణయించి స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నారు.

ఒంటరి యువకుడికి ఆసరా: హుజురాబాద్ మండలం శాలపల్లి–ఇందిరానగర్ గ్రామంలోని న్యూ ఇందిరానగర్ కాలనీకి చెందిన రౌతు తరుణ్ తల్లిదండ్రులు లేక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఒంటరిగా జీవిస్తున్నాడు.

సర్పంచ్ చొరవ – ప్రభుత్వ పథకం: తరుణ్ పరిస్థితిని గుర్తించిన గ్రామ సర్పంచ్ కోడిగుటి ప్రవీణ్, ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించారు.ఉచిత నిర్మాణ బాధ్యత: ఇల్లు మంజూరైనప్పటికీ, అదనపు నిర్మాణ ఖర్చులు భరించే శక్తి తరుణ్‌కు లేకపోవడంతో, సర్పంచ్ తన సొంత డబ్బులతోనే ఇంటి నిర్మాణాన్ని ఉచితంగా పూర్తి చేయిస్తానని మాట ఇచ్చారు.

శాస్త్రోక్తంగా పనుల ప్రారంభం: ఆదివారం రోజున సర్పంచ్ కోడిగుటి ప్రవీణ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో ఇందిరమ్మ ఇంటి స్థలంలో ముగ్గు వేసి, కొబ్బరికాయ కొట్టి పనులను ఘనంగా ప్రారంభించారు.

“అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే మా లక్ష్యం. తల్లిదండ్రులు లేని తరుణ్‌కు సొంతింటి కల నెరవేర్చడం నా బాధ్యతగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను.”— కోడిగుటి ప్రవీణ్, గ్రామ సర్పంచ్

కన్నీటి పర్యంతమైన లబ్ధిదారుడు:తనకు తల్లిదండ్రులు లేరని, సొంతంగా ఇల్లు కట్టుకునే స్తోమత లేని సమయంలో సర్పంచ్ ప్రవీణ్ అండగా నిలిచి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వడం జీవితంలో మర్చిపోలేని సహాయమని లబ్ధిదారుడు రౌతు తరుణ్ భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజాప్రతినిధి అంటే కేవలం అధికారానికే పరిమితం కాకుండా, ఆపదలో ఉన్న నిరుపేదలకు అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవ అని సర్పంచ్ చేసిన ఈ ఉదార స్వభావాన్ని గ్రా ప్రజలు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కొనియాడుతున్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor