కరీంనగర్ · September 3, 2026

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ పోరుబాట

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో వీణవంకలో భారీ నిరసన

కరీంనగర్/వీణవంక,వి90 న్యూస్,సెప్టెంబర్ 03: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు వీణవంక మండల కేంద్రంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రెండువేల మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొని ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు దేవుళ్ల సాక్షిగా ప్రమాణం చేసి గ్యారెంటీ కార్డులు ఇచ్చి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకులు మాట తప్పారని విమర్శించారు. రైతు భరోసా, రూ. 2 లక్షల రుణమాఫీ, రూ. 500 బోనస్ అమలు కాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మహిళలకు రూ. 2,500 సాయం, తులం బంగారం, పెంచిన పింఛన్లు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజల పక్షాన రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండ శ్రీనివాస్, వాల బాలకిషన్ రావు, ముసిపట్ల తిరుపతి రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor