కరీంనగర్ · September 3, 2026

హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన కీలక నేతలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 03: హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గొట్టే రాజశేఖర్, సిరిసేడు గ్రామానికి చెందిన ఎస్సీ సెల్ నాయకుడు రేనుకుంట్ల జానీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ గులాబీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్‌తోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని, హుజూరాబాద్‌లో రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. చేరిన నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీపీ వెంకటేష్, సిరిసేడు సర్పంచ్ కుమార్, దామోదర్, మాజీ ఎంపీటీసీ చిన్న రాయుడు తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor