కరీంనగర్ · September 5, 2026

జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

గురువులను సత్కరించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 05: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం (NSS) ఆధ్వర్యంలో గురువులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) గురువులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు, అధ్యాపకులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. అక్షరాలు నేర్పిన తొలి గురువు నుండి జీవిత విలువలను నూరిపోసిన ఉపాధ్యాయుల వరకు ప్రతి ఒక్కరి కృషి మన భవిష్యత్తు ఎదుగుదలలో చెరగని ముద్ర వేస్తుందని కొనియాడారు.డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని చైర్మన్ పేర్కొన్నారు. పేదరికం, అవకాశాల కొరత లక్ష్య సాధనకు అడ్డంకి కావని, నిరంతర అధ్యయనం, పట్టుదలతోనే ఆయన దేశ అత్యున్నత పదవిని అధిరోహించారని వివరించారు. సెప్టెంబర్ 5 కేవలం వేడుక మాత్రమే కాదని, జ్ఞానాన్ని పంచే గురువుల విలువను గుర్తుచేసుకునే రోజని అన్నారు.

విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, కంటికి రెప్పలా పెంచిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, తాను మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న కాలంలోనే కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం పూర్తయ్యేలా చూస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం. కుమార్, ఎన్ఎస్ఎస్ అధికారులు కె. తిరుపతి, ఇ. జ్యోత్స్నాదేవకి, అధ్యాపకులు సిహెచ్. విశ్వనాథ్ రెడ్డి, జి. ప్రభాకర్, డి. మహేష్, ఎం. శ్రీధర్, ఎస్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor