కరీంనగర్ · September 5, 2026

ఇల్లందకుంట పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం: గురువులను శాలువాలతో సత్కరించిన విద్యార్థులు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 05: ఇల్లందకుంట మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, గురువులపై తమకున్న గౌరవాభిమానాలను చాటుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తస్లీమ్ నజ్మీన్ మాట్లాడుతూ.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం ఉపాధ్యాయుడు వేణు మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణన్ మైసూరు విశ్వవిద్యాలయం నుండి కలకత్తా విశ్వవిద్యాలయానికి బదిలీపై వెళ్తున్న సమయంలో, ఆయనపై ఉన్న అపారమైన గురుభక్తితో విద్యార్థులు గుర్రపు బండికి ఉన్న గుర్రాలను తొలగించి తామే స్వయంగా రైల్వే స్టేషన్ వరకు లాక్కెళ్లిన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేశారు. విద్యార్థులు గురువుల పట్ల ఎల్లప్పుడూ వినయవిధేయతలతో మెలిగి ప్రయోజకులు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు తస్లీమ్ నజ్మీన్ తో పాటు ఉపాధ్యాయులు కే. జయప్రకాష్, సిహెచ్. వేణు, కే. సత్యం, ఎం. సమిరెడ్డి, జి. అన్నపూర్ణ, ఏ. సురేష్, సిహెచ్. రామకృష్ణ, కే. శంకర్, రాధిక రాణి, శైలజ, ఎం. ఐలయ్య, ఆర్. దేవేందర్, యు. లక్ష్మణాచారి, ఎం. స్రవంతి, డి. పరమేశ్వర్, వనిత, వినీత , పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor