కరీంనగర్ · September 6, 2026

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 06: జమ్మికుంట పట్టణ పరిధిలోని మేదరివాడలో శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ (SVUC) ఆధ్వర్యంలో నిర్వహించిన విఘ్నేశ్వర స్వామి వారి ఆగమన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

SVUC కమిటీ సభ్యులు మట్టి గణపతిని ప్రతిష్ఠించి పట్టణ ప్రజలందరికీ పర్యావరణ పరిరక్షణపై ఒక మంచి సందేశాన్ని ఇచ్చారని ఆయన కొనియాడారు.పట్టణ ప్రజలందరూ ఇదే స్ఫూర్తితో తమ మండపాలలో మట్టి గణపతులనే నిలుపుకోవాలని చైర్మన్ పిలుపునిచ్చారు. నవరాత్రుల ఉత్సవాల్లో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆ గణనాథుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు చింతల శ్రీనివాస్, కొలుగురి సురేష్, కూతడి తిరుపతి, శ్రీకాంత్, అలాగే SVUC కమిటీ సభ్యులు వినయ్, సాయి, నరేందర్, శ్యామ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor