కరీంనగర్ · September 8, 2026

కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధానికి BRSV యత్నం: జమ్మికుంటలో పోలీసులతో తోపులాట, ఉద్రిక్తత

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,సెప్టెంబర్ 08: అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల తీరును నిరసిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌వి (BRSV) జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీఆర్‌ఎస్‌వి నాయకులు యత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వి పట్టణ అధ్యక్షుడు కొమ్ము నరేష్, నాయకుడు జి. అనిల్ మాట్లాడుతూ..

కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిరసన తెలిపేందుకు అసెంబ్లీకి వెళ్లిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై, చివరికి మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా పోలీసులు అనుచితంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను నెరవేర్చకుండా వైఫల్యం చెందిన ప్రభుత్వం, ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్‌వి నాయకులను, బీఆర్‌ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేయడం దారుణమన్నారు.ఎన్ని అరెస్టులు చేసినా, లాఠీఛార్జీలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నాటి తెలంగాణ ఉద్యమంలో ఏవిధంగానైతే చీమల దండులా కదిలి పోరాటాలు చేశామో, అదే రీతిలో మళ్లీ ప్రజా సమస్యలపై పోరాడుతామని హెచ్చరించారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు, సమస్త ప్రజానీకానికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయకపోతే రానున్న రోజుల్లో కేసీఆర్ పిలుపు మేరకు గాంధీభవన్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వి నాయకులు నల్లగాసే హరీష్, బి. ప్రశాంత్, వార్డు అధ్యక్షులు ఎండీ సలీం, మల్లికార్జున్, శ్రీనివాస్, అబ్రార్, సన్నీ, రాజు, సిద్ధూ, రమేష్, కౌశిక్, వినయ్, శివ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor