కరీంనగర్ · September 10, 2026

రైతుల సమస్యల పరిష్కారానికి సైదాపూర్‌లో బీజేపి రాస్తారోకో.. పలువురి అరెస్ట్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/వే సైదాపురం,వి90 న్యూస్, సెప్టెంబర్ 10: వ్యవసాయానికి విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా అందించాలని డిమాండ్ చేస్తూ సైదాపూర్ మండల అధ్యక్షుడు దంచనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు. పంటలకు కీలకమైన సమయంలో కరెంటు కోతలు, తీవ్రమైన లో-వోల్టేజ్ , తరచూ విద్యుత్ అంతరాయాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు మండిపడ్డారు. విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రాస్తారోకో నిర్వహిస్తున్న నిరసనకారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నిరంతర విద్యుత్ అందించాలని ఈ సందర్భంగా బీజేపి నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి, బీజేపి జిల్లా కార్యవర్గ సభ్యులు మదన్మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు విరమణ రవీందర్ రెడ్డి, జంపాల సంతోష్, మండల ప్రధాన కార్యదర్శులు భరద్వాజ, అశోక్, రావులపల్లి గ్రామ సర్పంచ్ అను మల్ల రామ్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు దొమ్మాటి వీరన్న, పోతురాజు సుధాకర్, దొడ్డి శ్రీనివాస్, ఎగ్లాస్పూర్ ఉపసర్పంచ్ కార్తీక్, వివిధ మోర్చాల అధ్యక్షులు వర్ణాల రఘు, వజ్జరాజు ప్రసాద్ రెడ్డి, తోటి రమ్య శ్రీనాథ్, తలారి యాదగిరిలతో పాటు పార్టీ నాయకులు కందిమల్లారెడ్డి, సత్యం, నరేష్, ఆనంద్, కృష్ణ ప్రసాద్, గణేష్ రెడ్డి, కిరణ్, పున్నం శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, వినోదు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor