కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 11: జమ్మికుంట పట్టణ పరిధిలోని వీధి వ్యాపారులతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి వ్యాపారులు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని తమ చిన్న వ్యాపారాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా తిరిగి చెల్లించడం ద్వారా భవిష్యత్తులో బ్యాంకు నుంచి మరిన్ని ఎక్కువ మొత్తంలో రుణాలు పొందే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఇన్చార్జ్ టీఎంసీ మల్లీశ్వరి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ అర్పితతో పాటు పలువురు వీధి వ్యాపారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

