కరీంనగర్ · September 12, 2026

పెయింటర్ అసోసియేషన్ నూతన కమిటీకి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ శుభాకాంక్షలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 12: జమ్మికుంట పట్టణ పెయింటర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) అభినందించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు చొల్లెటి శ్యామ్, ఉపాధ్యక్షులు పొడేటి మొగిలి, గౌరవ అధ్యక్షులు జక్కే రవీందర్ తో పాటు కమిటీ సభ్యులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణంలో పెయింటింగ్, పుట్టి, సీలింగ్ తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు నూతన కమిటీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. సభ్యులందరూ ఐక్యతతో మెలుగుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా, పట్టణాభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని కోరారు.కార్మికులకు భవన నిర్మాణం, పెయింటింగ్ పనుల్లో ఏవైనా సమస్యలు ఎదురైతే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని, వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అందే లేబర్ కార్డులు, హెల్త్ కార్డులు , ఇతర సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కార్మికుడికి దక్కేలా పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు చుంచూ శివ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జక్కే ప్రభాకర్, చరణ్, నర్సయ్య, యాదగిరి, జమీర్, జానీ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor