కరీంనగర్ · September 16, 2026

హుజూరాబాద్ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ వొడితల రాజేశ్వర్ రావు — కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్, సెప్టెంబర్ 16: హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి మాజీ రాజ్యసభ సభ్యుడు స్వర్గీయ వొడితల రాజేశ్వర్ రావు అని, ఆయన చూపిన బాటలోనే నడుస్తూ ప్రజలకు మరింత సేవ అందిస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ పేర్కొన్నారు. బుధవారం రోజున రాజేశ్వర్ రావు జయంతిని పురస్కరించుకుని హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ, రాజేశ్వర్ రావు చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికీ నియోజకవర్గంలో సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని, ఆయన దూరదృష్టి వల్ల ఆ సేవలు ఇప్పటితరానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని గుర్తుచేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అభిమానులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ వేడుకల్లో పలువురు నాయకులు ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor