తెలంగాణ · September 17, 2026

ప్రపంచంతో పోటీపడేలా ఆధునిక తెలంగాణ నిర్మాణం: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 17: నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధి సాధించి, తెలంగాణను ప్రపంచం గర్వించే స్థాయికి తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ’ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో అంతర్భాగమై రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి బాటలు పడ్డాయని, ఉద్యమ స్ఫూర్తితో ప్రజా పాలనను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయమే పునాదిగా ప్రజా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని స్పష్టం చేశారు.రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931కి చేరి దేశ సగటు కంటే 91 శాతం అధికంగా ఉందన్న సీఎం, సంక్షేమం, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

రూ. 20,616 కోట్లతో 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేశామని, పండించిన వరికి రూ. 500 బోనస్ ఇస్తూ రైతు సంక్షేమానికి రూ. 1.72 లక్షల కోట్లు వెచ్చించామని వివరించారు. మహాలక్ష్మి పథకంతో ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మహిళలకు రూ. 12,385 కోట్లు ఆదా చేశామని, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

సామాజిక న్యాయం దిశగా చారిత్రాత్మక కుల సర్వే పూర్తి చేసి, స్థానిక సంస్థలు, విద్య, ఉపాధిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. విద్య, వైద్య రంగాలు ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని, రూ. 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో పాటు నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఉస్మానియా, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతం చేశామని తెలిపారు. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు నైపుణ్యాభివృద్ధికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు.

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికలు రూపొందించామని సీఎం వెల్లడించారు. ఇందులో భాగంగా 30 వేల ఎకరాల్లో తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ని నిర్మిస్తున్నామని, ఇందులో టీసీఎస్ రూ. 70 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని తెలిపారు. మూసీ పునరుజ్జీవనం, మెట్రో రెండో దశ విస్తరణ, మూడంచెల రహదారుల అభివృద్ధితో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor