తెలంగాణ · September 18, 2026

ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర సహకారాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 18: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజులతో కలిసి ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్రానికి కావాల్సిన సహాయంపై వివరాలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు.వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని, అయితే ప్రజలకు తాగునీరు, విద్యుత్ కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని ముఖ్యమంత్రి వివరించారు. ఎల్‌నినో నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటలు, పంటల మార్పిడి వైపు ప్రోత్సహిస్తున్నామని, ఈ విషయంలో కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంలో భాగంగా 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్లు, కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

పీఎంఏవై-జీ (PMAYG) పథకం కింద మొదటి విడతగా రాష్ట్రానికి రెండు లక్షల ఇండ్లు కేటాయించినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జూలై నెలలో ఢిల్లీలో కలిసినప్పుడు రాష్ట్రంలోని 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, డిమాండ్‌కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇండ్లను వెంటనే కేటాయించాలని కోరారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు క్వింటాలుకు రూ. 500 బోనస్ అందిస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor