కరీంనగర్ · September 21, 2026

కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలో పాల్గొని విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 21: జమ్మికుంట పట్టణ పరిధిలోని గాంధీ చౌరస్తాలో నిర్వహించిన తెలంగాణ మలిదశ ఉద్యమ నేత, ప్రముఖ సామాజిక వేత్త కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్ ) పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పద్మశాలి వీధిలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటుకు కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవులను సైతం త్యాగం చేసి మలిదశ ఉద్యమానికి కొండ లక్ష్మణ్ బాపూజీ మార్గదర్శిగా నిలిచారని, జీవితాంతం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం శ్రమించిన ఆయన మహోన్నతుడని కొనియాడారు.

జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి బంధువులతో తనకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని, గతంలో 12వ వార్డు నుంచి రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలిపించిన పద్మశాలి కులబాంధవులకు ఎల్లప్పుడూ కుటుంబ సభ్యుడిగా ఉంటానని స్పష్టం చేశారు. పద్మశాలి వార్డుకు వెళ్లే దారిలో ఒక కమాన్ నిర్మించడంతో పాటు, మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని ‘పద్మశాలి మార్గ్’గా నామకరణం చేయడానికి మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు స్థానిక కౌన్సిలర్ చుంచు రమాదేవి, దిడ్డి రాము, కౌన్సిలర్ల సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చుంచు రమాదేవి, చింతల శ్రీనివాస్, దిడ్డి రాములతో పాటు నాయకులు చుంచు శివ, ఉడుత రమేష్, మనోహర్, అరకాల వీరేశలింగం, పద్మశాలి సంఘం ప్రతినిధులు, పద్మశాలి కుటుంబ సభ్యులు , పలువురు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor