తెలంగాణ · September 21, 2026

సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసంపై జిల్లా కలెక్టర్లతో మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 21: డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, నిర్వాసితుల పునరావాస ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్లతో మంత్రులు పొన్నం ప్రభాకర్ ,ఉత్తమ్‌ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడమైనది. ఈ సమావేశంలో జిల్లాలవారీగా ప్రాజెక్టుల పురోగతిని, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ కేసుల ప్రస్తుత స్థితిని కలెక్టర్లను అడిగి తెలుసుకుంటూ, ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాస , పునర్వ్యవస్థీకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాని జోషి, ఆర్థిక శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజు, భూసేకరణ-పునరావాస కమిషనర్‌ శివకుమార్‌ నాయుడు, ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ రమేష్‌బాబు, నీటిపారుదల శాఖ సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. సమావేశంలో ప్రాజెక్టుల వారీగా సేకరించాల్సిన భూమి, ఇప్పటికే పూర్తయిన భూసేకరణ వివరాలపై విస్తృతంగా చర్చించారు. అదేవిధంగా పునరావాస కేంద్రాల ఏర్పాటు, పరిహారం చెల్లింపు, నిర్వాసిత కుటుంబాలకు కల్పించాల్సిన మౌలిక సౌకర్యాలతో పాటు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, అటవీ శాఖ సంబంధిత అంశాలపై సమగ్రంగా సమీక్షించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor