తెలంగాణ · September 22, 2026

క్యాన్సర్‌ బాధిత గిగ్‌ వర్కర్‌ కొండల్‌ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం కొండంత అండ: నిమ్స్‌లో ఉచిత వైద్యం, సీఎంఆర్‌ఎఫ్ సహాయం అందజేత

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 22: క్యాన్సర్‌తో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్‌ మెట్టుకుపల్లి కొండల్‌ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు కొండల్‌ రెడ్డికి నిమ్స్ ఆసుపత్రిలో అవసరమైన పూర్తి స్థాయి చికిత్సను ఉచితంగా అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ.2,77,500 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (TGPWU) సభ్యుడైన కొండల్‌ రెడ్డి దాదాపు పదేళ్లుగా ఉబర్‌ డ్రైవర్‌గా సేవలందిస్తూ 7,620కి పైగా ట్రిప్పులు పూర్తి చేశారు. అయితే, కొంతకాలంగా ఆయన కాలేయ, ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ నాలుగో దశతో బాధపడుతుండటంతో ఉపాధి కోల్పోయి, పాఠశాలకు వెళ్లే ఇద్దరు కుమార్తెలతో కూడిన ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.తన చికిత్సకు సాయం అందించాలని కొండల్‌ రెడ్డి ఉబర్ ఇండియాను ఆశ్రయించగా, ఈ విషయం కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అంశాన్ని తీసుకెళ్లడంతో ప్రభుత్వం తక్షణ సాయాన్ని ప్రకటిస్తూ సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందజేసింది. అంతేకాకుండా నిమ్స్‌లో కొండల్‌ రెడ్డికి ప్రభుత్వం వైపు నుంచే ఉచితంగా మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టింది. బాధితుడికి అవసరమైన సమయానికి ప్రభుత్వం స్పందించి ఆదుకోవడం పట్ల TGPWU అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌ ముఖ్యమంత్రికి, కార్మిక శాఖ మంత్రికి , సీఎంఓ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor