కరీంనగర్ · May 2, 2026

జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్‌కు ఘన సన్మానం: రాములవారి ముత్యాల తలంబ్రాలు అందజేసిన దేవస్థాన చైర్మన్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట మే 2: హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వచ్చి జమ్మికుంట రూరల్ సీఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పులి వెంకట్ నీ శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీఐ ని శాలువాతో ఘనంగా సన్మానించి, రాములవారి ముత్యాల తలంబ్రాలు , స్వామివారి మెమెంటోను బహుకరించారు. ఈ క్రమంలో రామారావు సీఐ ని ప్రత్యేకంగా దేవస్థాన దర్శనానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తలు పరమేష్, కిరణ్, గోపాల్ రెడ్డిలతో పాటు ఫిషర్మెన్ రాష్ట్ర కార్యదర్శి రాకేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సలీం, యూత్ కాంగ్రెస్ నాయకులు కిరణ్ తదితరులు పాల్గొని సీఐ శుభాకాంక్షలు తెలియజేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor