కరీంనగర్ · September 26, 2026

ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఇమ్రాన్‌పై దుష్ప్రచారం.. చట్టపరమైన చర్యలకు హెచ్చరిక

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 26: తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునే కుట్రలో భాగంగానే కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఇమ్రాన్ ఆరోపించారు. అసత్య పోస్టుల ద్వారా తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు యత్నిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామికి మద్దతుగా నిలవడం, పార్టీ అగ్రనేతలను కలవడాన్ని కొందరు కావాలని వివాదాస్పదం చేస్తున్నారని పేర్కొన్నారు. కుల, సామాజిక వర్గాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేస్తుండటాన్ని జీర్ణించుకోలేకనే ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించిన ఇమ్రాన్, ఇకపై కూడా ఇటువంటి చర్యలు కొనసాగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor