కరీంనగర్,వి90 న్యూస్,సెప్టెంబర్ 26: ముఖ్యమంత్రి రేవంత రెడ్డి పర్యటన కు సంబంధించిన వివరాలను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ నెల 30వ తేదీన సీఎం ముందుగా కరీంనగర్ జిల్లాలో పర్యటించి, అక్కడ నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అదేవిధంగా జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.కరీంనగర్ కార్యక్రమాల అనంతరం ముఖ్యమంత్రి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా 33 నెలల ప్రజాపాలనలో తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. వీటితో పాటు సామాజిక న్యాయం, ప్రజాస్వామిక ఆకాంక్షలు, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన కీలక అంశాలపై సీఎం తన సందేశాన్ని ఇస్తారు.సిరిసిల్లలో నిర్వహించనున్న ఈ సభను పురస్కరించుకుని “చలో సిరిసిల్ల” కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ విజయవంతమైన కార్యక్రమానికి ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు , కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా, పెద్ద ఎత్తున తరలివచ్చి విజయం చేకూర్చాలని మంత్రి ఆహ్వానించారు.

