హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 28: భారత బ్యాంకుల సమితి (ఐబీఏ) ఇచ్చి న హామీతో బ్యాంకు ఉద్యోగ సంఘాల సమాఖ్య (యూఎఫ్‌బీయూ) మూడు రోజుల పాటు చేపట్ట తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసింది. బ్యాంకు ఉద్యోగులు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న ‘అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించే’ అంశంపై చర్చించేందుకు ఐబీఏ, యూఎఫ్‌బీయూ ప్రతినిధులతో ప్రత్యేకంగా ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. సమ్మె పిలుపును ఉపసంహరించుకోవడంతో సోమవారం నుంచి దేశమంతటా బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. దీంతో వినియోగదారులకు డిపాజిట్లు, ఉపసంహరణలు, ఇతర ఆర్థిక లావాదేవీలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందుబాటులో ఉంటాయి.

