కరీంనగర్ · September 28, 2026

షతరంజీ చేనేత సొసైటీ మహాసభలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్): ఐక్యతతోనే సంఘం అభివృద్ధి సాధ్యం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 28: షతరంజీ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి , విక్రయ సంఘం లిమిటెడ్ 75వ వార్షిక 86వ సాధారణ మహాసభలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఎన్నికల అనంతరం అందరం ఒకే కుటుంబంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు గానీ, సంఘానికి గానీ నష్టం చేకూర్చాలనే ఉద్దేశం ఎవరికీ ఉండదని స్పష్టం చేశారు. మన మధ్య ఏవైనా చిన్నపాటి సమస్యలు ఉంటే బయట చర్చించకుండా ఇలాంటి సమావేశాల్లోనే ముఖాముఖిగా మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు.

కార్మికుల సంక్షేమం, ఉత్పత్తుల విక్రయాలు, ఉద్యోగ అవకాశాలు , అధికారులతో సమన్వయం వంటి విషయాలపై జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి సొసైటీ అభివృద్ధికి అవసరమైన సహకారం పొందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.గత నాలుగు సంవత్సరాలుగా సంఘం అభివృద్ధికి అందరం కలిసికట్టుగా చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ సంస్థను వంద రెట్లు అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు శ్రమిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరి ఆశీస్సులు, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చుంచు రమాదేవి, సొసైటీ ప్రెసిడెంట్ ఉడుత రమేష్, ప్రవీణ్, మహాసభ ప్రారంభకులు జి. రాఘవరావు, దాసరి రాజేందర్, మల్లయ్య, శ్రీనివాస్, దామోదర్, రాజమౌళి, సరోజన, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor