కరీంనగర్/హుజూరాబాద్,వి90 న్యూస్, సెప్టెంబర్ 28: హుజురాబాద్ పట్టణంలోని పలు వార్డులకు చెందిన నిరుపేద లబ్ధిదారులకు మంజూరైన రూ.4,35,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ చెక్కులు పెద్ద ఆసరాగా నిలుస్తాయని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్య సమయంలో వైద్య ఖర్చులు పేదలకు పెద్ద భారంగా మారుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో సీఎమ్‌ఆర్‌ఎఫ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా తమ వైద్య ఖర్చుల వేళ ఆర్థిక సహాయం అందించినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్ గందె శ్రీనివాస్, నరేష్, నర్సారెడ్డి లావణ్య, మాజీ కౌన్సిలర్లు కోలిపాక శ్రీనివాస్, ఇమ్రాన్, రమేష్, శాంతన్ రెడ్డి, పూర్ణ చందర్, శ్రీనివాస్, ముత్యం రాజు, తిరుమల్ రెడ్డి, రమాదేవిలతో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు , లబ్ధిదారులు పాల్గొన్నారు.

