తెలంగాణ · September 28, 2026

ప్రజాభవన్‌లో బీసీ సంక్షేమ శాఖ సమీక్ష: సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

రాజీవ్ యువ వికాసం పథకం నవంబర్ నుంచే ప్రారంభం

హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 28: రాష్ట్రంలో బీసీ సంక్షేమ పథకాల అమలుకు ప్రజా ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందని, పారదర్శక పాలనే ధ్యేయంగా సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజాభవన్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంక్షేమ పథకాల పురోగతిపై సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా ఇప్పటివరకు బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన 1.30 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లో ₹450 కోట్ల స్కాలర్‌షిప్ నిధులను నేరుగా జమ చేసినట్లు తెలిపారు. హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలను కూడా ప్రతి నెలా నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు. విదేశీ విద్యను అభ్యసించే 180 మంది విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కింద ₹18.40 కోట్లు విడుదల చేశామని, అర్హులైన మిగిలిన విద్యార్థులందరికీ లబ్ధి చేకూరేలా దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు వివరించారు.గీత కార్మికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ₹60 కోట్ల వ్యయంతో 50 వేల ‘కాటమయ్య రక్షణ కవచాలు’ అందించే ప్రక్రియను వేగవంతం చేశామని, ఇప్పటికే 40 వేల కిట్లు అందజేయగా, శిక్షణ పూర్తికాగానే మిగిలిన 10 వేల కిట్లను కూడా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే బీసీ నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసానిచ్చే ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా పరిశీలించాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఎంజేపీ గురుకులాల పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేయడంతో పాటు బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులను త్వరితగతిన మంజూరు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor