తెలంగాణ · October 9, 2026

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ఈ నెల 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్ష

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,అక్టోబర్ 09: రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 12వ తేదీన మంత్రులతో ఉన్నత స్థాయి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వర్షపాతం తగ్గిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ సహాయక చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సరఫరా, పెరిగిన విద్యుత్ డిమాండ్, అత్యవసర అవసరాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ వర్షాభావ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదవ్వగా, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బాధిత మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడంతో పాటు తగిన ఆర్థిక సాయం అందించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కేంద్రం నుండి రూ. 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రతిపాదించారు.ఈ నెల 12న జరగబోయే కీలక సమావేశంలో వర్షాభావ ప్రాంతాల్లో చేపట్టాల్సిన తక్షణ సహాయక చర్యలు, మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన కార్యాచరణతో పాటు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు, రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణుల సలహాలు, సూచనలను స్వీకరించే అంశాలపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor