కరీంనగర్ · May 11, 2026

ఇల్లందకుంట పాఠశాలలో ఘనంగా విద్యా వారోత్సవాలు: సైన్స్ ల్యాబ్, సమ్మర్ క్యాంప్‌లను ప్రారంభించిన సర్పంచ్ , తహసీల్దార్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్ ,ఇల్లందకుంట,వి90 న్యూస్, మే 11: ఇల్లందకుంట మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య – ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ అనుసరించి విద్యా వారోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మే 11 నుండి 17 వరకు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన సోమవారం నాడు పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్‌ను గ్రామ సర్పంచ్ దార సురేష్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్‌ను మండల తహసీల్దార్ భాస్కరరావు ప్రారంభించగా, ఇల్లందకుంటలోని భవిత కేంద్రాన్ని సర్పంచ్ , తహసీల్దార్ సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ దార సురేష్ మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీసేందుకు ఈ సమ్మర్ క్యాంప్ ఒక అద్భుతమైన వేదికని కొనియాడారు. ఇందులో కూచిపూడి నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ వంటి అంశాలతో పాటు క్రీడల్లో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ మానసిక వికాసాన్ని పెంపొందించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కె. రాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తస్మిన్ నజ్మీమ్ పాల్గొని విద్యా వారోత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. వారితో పాటు ఉపాధ్యాయులు జయప్రకాష్, వేణు, సత్యనారాయణ, శంకర్, సురేష్, రామకృష్ణ, అన్నపూర్ణ, సమ్మిరెడ్డి, కౌసల్య, ఐలయ్య, రాధికా రాణి, ఉమాదేవి, లక్ష్మణాచారి, పరమేష్, వనిత, స్రవంతి, ప్రకాష్ , పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor