జమ్మికుంటలో ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు: అన్నదానంలో పాల్గొన్న బీఆర్ఎస్ ముఖ్య నాయకులు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 03: జమ్మికుంట పట్టణంలో సిద్దిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక గాంధీ చౌరస్తా నందు బీఆర్ఎస్ శ్రేణులు, హరీష్ రావు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం స్థానిక శివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు అన్నప్రసాద వితరణ చేశారు.

ఈ సంబరాల్లో జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్లు తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, పోడేటి రామస్వామి, కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగిలి రమేష్, పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

వారితో పాటు మాజీ కౌన్సిలర్లు బొద్దుల రవీందర్, జుగురు సదానందం, గాజుల భాస్కర్, పాతకాల రమేష్, అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భోగం వెంకటేశ్, మద్ది సంపత్, రామడుగు రవీందర్, మైస రవి, సదానందం పాల్గొన్నారు. వార్డు అధ్యక్షులు గూట్ల మల్లికార్జున్, పరిమళ మాణిక్యం, పొనగంటి సందీప్‌లతో పాటు హరీష్ రావు అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

