తెలంగాణ · June 6, 2026

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం: రూ. 10 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

నల్లగొండ, వి90 న్యూస్, జూన్ 06: మిర్యాలగూడలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన మెరుపు దాడిలో ఒక అవినీతి అధికారి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. పాలకవీడు మండలం పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జాన్ పహాడ్ దర్గాకు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్కే మహమూద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఒక నియోజకవర్గ స్థాయి సప్లమెంటరీ నివేదికను ఉన్నతాధికారి (ఈఓ) కి సమర్పించేందుకు గాను సదరు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఒక బాధితుడి నుండి లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఈ విషయమై ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అవినీతి అధికారిని పట్టుకునేందుకు వారు వ్యూహాత్మకంగా వల పన్నారు.ఈ క్రమంలో శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద బాధితుడి నుండి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్ రూ. 10 వేల లంచం నగదును తీసుకుంటుండగా, ముందే నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు ఆయనను అడ్డుకొని రంగులతో సహా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు అనంతరం వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఎస్కే మహమూద్‌ను అధికారికంగా అరెస్ట్ చేశారు. ఈ దాడి అనంతరం మిర్యాలగూడలోని మందుల వారి కాలనీలో ఉన్న ఆయన నివాసంలో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. ఈ సోదాల్లో అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు ఏవైనా లభ్యమవుతాయా అనే కోణంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor