కరీంనగర్ · June 16, 2026

జగ్గయ్యపల్లి బొడ్రాయి ఉత్సవాలకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్‌కు ఆహ్వానం: కరపత్రం అందజేసిన కమిటీ సభ్యులు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 16: జగ్గయ్యపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి, నాభిశిల (బొడ్రాయి), పోచమ్మ తల్లి పంచదశ వార్షికోత్సవ ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా కోరుతూ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్‌)కు ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా ఆహ్వాన కరపత్రాన్ని అందజేశారు. ఈ నెల 17-06-2026 నుండి 19-06-2026 వరకు మూడు రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు మున్సిపల్ చైర్మన్ ముఖ్య అతిథిగా విచ్చేసి, అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆహ్వాన పత్రం అందజేసిన వారిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్ పొనగంటి రాము, ఉత్సవ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ కనపర్తి వంశీధర్ రావు, ఉపసర్పంచ్ నాయినేని వెంగల్ రావుతో పాటు ఉపేందర్, శ్రీకాంత్, శ్రీనివాస్, సంపత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor