సంప్రదాయ మార్కులకు చెక్: విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టేలా తెలంగాణలో ‘కాగ్నిచాంప్’ స్కాలర్‌షిప్!
హైదరాబాద్: తెలంగాణ : తెలంగాణకు చెందిన స్టార్టప్ cognitivescore.ai, వ్యవస్థాపకులు కీర్తి కుమార్ జైన్ మరియు విక్రమ్ సింగ్ నేగి సంప్రదాయ మార్కుల ఆధారిత మూల్యాంకనాన్ని మించి విద్యార్థుల మేధస్సును గుర్తించడానికి CogniCHAMP India Scholarship – Telangana Edition ను ప్రారంభించింది. ఈ స్కాలర్‌షిప్ 3 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. పరీక్ష 2026 మే 2 లేదా 3 తేదీల్లో 20 నిమిషాల ఆన్‌లైన్ గేమిఫైడ్ అసెస్‌మెంట్ రూపంలో నిర్వహించబడుతుంది. విద్యార్థులు ఎక్కడి నుండైనా, ఏ సమయంలోనైనా పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఏప్రిల్ 26, 2026.
ఈ ప్రోగ్రామ్‌లో Cognitive Quotient (CQ), Higher-Order Thinking, Foundational Literacy and Numeracy (FLN) తో పాటు Critical Thinking, Creativity, Collaboration, Communication వంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలను అంచనా వేస్తారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితం ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ₹499 ఫీజు ఉంటుంది.
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 100% వరకు ట్యూషన్ స్కాలర్‌షిప్ (ప్రతి సంవత్సరం ₹1 లక్ష వరకు, 12వ తరగతి వరకు) మరియు Top Cognitive Talent of Telangana గుర్తింపు లభిస్తుంది.
రిజిస్ట్రేషన్: https://cognichamp.cognitivescore.ai
