కరీంనగర్ · April 7, 2026

ఐరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట: పట్టణ పరిధిలోని మారుతి నగర్ హుజరాబాద్ రోడ్ లో ఉన్న దుర్గాభవాని ఫ్లై యాష్ బ్రిక్స్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం ఆదివారం ఐరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు ఆకుల శశిరేఖా నరసయ్య దంపతుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని స్థానిక 8 వార్డు కౌన్సిలర్ కొలుగూరి సురేష్ 9 వ వార్డు కౌన్సిలర్ పొనగంటి రాము 11వ వార్డు కౌన్సిలర్ పొన గంటి విష్ణులు ప్రారంభించారు వారు మాట్లాడుతూ వేసవికాలంలో ఈ ప్రాంతంలో రైతులు రైతు కూలీలు ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు నిర్వాహకులు మాట్లాడుతూ తమ మనవరాలు ఐరా పేరు మీద ఏర్పాటుచేసిన ఐరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం చలివేంద్రం తో పాటు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor