కరీంనగర్ ఏప్రిల్ 7:
కరీంనగర్ లో మంగళవారం పలు 10వ తరగతి పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం తనిఖీ చేశారు. తిరుమల్ నగర్ లోని తెలంగాణ మైనారిటీ బాలికల స్కూలు 2 , కోతి రాంపూర్ లోని సవరన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్ష రాసే విధానాన్ని పరిశీలించారు. పరీక్షల నిర్వహణ విద్యార్థుల హాజరు అంశాలపై
విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు.
పదో తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్
