కరీంనగర్ · June 24, 2026

హుజురాబాద్‌లో శ్రీ రేణుక మాతా ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన వొడితల ప్రణవ్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూన్ 24: హుజురాబాద్ పట్టణంలోని శ్రీ రేణుక మాతా ఎల్లమ్మ తల్లిని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలందరూ పాడి, పంటలతో, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందాడ సుహాసిని, స్థానిక కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు, గౌడ సంఘం నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor