కరీంనగర్ · June 26, 2026

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా ‘చలో కొడంగల్’ కార్ల ర్యాలీ: జయప్రదం చేయాలని ఉద్యమకారుల ఫోరం పిలుపు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 26: తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా కొడంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించ తలపెట్టారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి కొడంగల్ వరకు నిర్వహించనున్న ‘చలో కొడంగల్’ కార్ల ర్యాలీని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎక్కడి సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యమకారుల డిమాండ్లను చేర్చడమే కాకుండా, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేకే (కే. కేశవరావు) కమిటీని నియమించడం తమ ఉద్యమకారుల ఫోరం సాధించిన గొప్ప విజయమని హర్షం వ్యక్తం చేశారు.ఈ కమిటీ ఎలాంటి కాలయాపన లేకుండా ఉద్యమకారులకు ఇచ్చిన అన్ని హామీలను త్వరితగతిన నెరవేర్చాలని వారు కోరారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి కృతజ్ఞతగా కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని తలపెట్టామని, ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని 33 జిల్లాల ఉద్యమకారులతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన ఉద్యమకారులు కూడా స్వచ్ఛందంగా కార్ల ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడేళ్ల కుమారస్వామి, కాన్‌స్టిట్యూయెన్సీ ఇన్చార్జి ఆరే రమేష్ రెడ్డి, రేణిగుంట్ల రజిని కుమార్, జమ్మికుంట టౌన్ అధ్యక్షులు మద్దూరి శంకరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్ర భూమిరెడ్డి, ఉపాధ్యక్షులు రాం రాజబాబు, ఎజ్జే తిరుపతి, ఇమ్మడి రాజు, మోతే స్వామి, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కనవేని సతీష్ కుమార్, రచ్చ గణేష్, అక్కనపెళ్లి నవీన్ కుమార్ తదితర ముఖ్య నేతలు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor