క్రైమ్ · June 28, 2026

మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొట్టిన కారు, ఇంటర్ విద్యార్థి దుర్మరణం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

మంచిర్యాల,వి90 న్యూస్,జూన్ 28: మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ (జిఎం) కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక కారు ఒక్కసారిగా అదుపుతప్పి, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న సాయి సుశీల్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఉన్న మిగిలిన ముగ్గురు ప్రయాణికులకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న జైపూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు శిథిలాల మధ్య చిక్కుకుపోయిన బాధితులను అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించిన జైపూర్ పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor