హైదరాబాద్ శిల్పకళా వేదికలో ‘రైతు భరోసా’ పంపిణీ సదస్సు: అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

0
FB_IMG_1782745319893

హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 29: తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే ‘రైతు భరోసా’ నిధుల పంపిణీ సదస్సును హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు. నిజానికి ఈ పంపిణీ కార్యక్రమం కోసం తొలుత మధిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో భారీ ఎత్తున ‘రైతు ఆశీర్వాద సభ’ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్రస్తుత వర్షాల కారణంగా ఆ బహిరంగ సభను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు, ప్రత్యామ్నాయంగా శిల్పకళా వేదికలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. ఈ సదస్సు 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు తమతమ గ్రామాల్లోని రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్షంగా అనుసంధానమై పాల్గొనేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed