కరీంనగర్, వీణవంక ,ఏప్రిల్ 26(V90 NEWS):కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి దశలో లబ్ధిదారులు తమ స్వంతింటి కల నెరవేర్చుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వారికి ఆర్థిక భరోసా కల్పించిందని, ఇందిరమ్మ ఇంటి ద్వారా పేదవాడి సొంతింటి కల నెరవేర్చామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం రోజున వీణవంక మండల పరిధిలోని కనపర్తి, ఘన్ముక్ల, నరసింహులపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన వొడితల ప్రణవ్‌కు లబ్ధిదారులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భరోసాతో పాటు, వారికి మేమున్నాం అనే ధైర్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన మిగతా లబ్ధిదారులందరికీ త్వరలోనే రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీణవంక మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లతో పేదవాడి సొంతింటి కల సాకారం: వొడితల ప్రణవ్
