బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు రెండు రోజుల దీక్షకు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి సంఘీభావం
హైదరాబాద్,వి90న్యూస్,ఆగస్టు 24: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన రెండు రోజుల దీక్షకు బీజేపీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ దీక్షా కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, నాగేశ్, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, కొమురయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజు భూపాల్ గౌడ్, జిల్లా ఇంచార్జీలు KVLN రెడ్డి, బాపు రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు పాల్గొని మద్దతు ప్రకటించారు.రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వల్ల దాదాపు 20 లక్షల మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు , కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నాయకులు మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడకుండా ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని, విద్యార్థులకు ఆమోదయోగ్యమైన న్యాయం జరిగే వరకు తమ పోరాటం , ఉద్యమం ఆగదని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.

