తెలంగాణ · August 24, 2026

అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకోవడం తెలంగాణ పట్ల తీవ్ర వివక్షే: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండన

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,ఆగస్టు 24: అమెరికా పర్యటనకు అనుమతిని రాజకీయ కారణాలతో తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనికతతో రాష్ట్ర అభివృద్ధి కోసం స్పష్టమైన లక్ష్యంతో తలపెట్టిన ఈ పర్యటనను అడ్డుకోవడమంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

ఈ పర్యటనకు సంబంధించిన సమగ్ర వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ముందుగానే అందించామని, ఇందులో ఎలాంటి దాపరికం లేదని సీఎం తెలిపారు. వచ్చే డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించబోయే ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సమ్మిట్‌లో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించడానికి, అలాగే ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాలు, క్రీడా సంస్థల పెట్టుబడులను ఆకర్షించడానికే ఈ పర్యటన ఖరారు చేశామని వివరించారు. గుజరాత్ ముఖ్యమంత్రి వైబ్రెంట్ గుజరాత్ కోసం రోడ్ షోలకు అమెరికా, కెనడా వెళ్లడానికి అనుమతించిన కేంద్రం, తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనకు నిరాకరించడం దేశ ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని మండిపడ్డారు.లండన్ పర్యటనలో ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలతో జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయని, అక్కడి ఉన్నత విద్యను తెలంగాణ విద్యార్థులకు ఇక్కడే అందుబాటులోకి తీసుకురావాలన్నది తమ ఆలోచన అని సీఎం పేర్కొన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్య సాధనకు కేంద్ర వైఖరి అడ్డంకిగా మారిందని ఆవే.దన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వివక్షపూరితమైన ఈ నిర్ణయాన్ని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని, విదేశీ పర్యటనలు ఆగినా తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలు ఆగవని స్పష్టం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor