తెలంగాణ · August 29, 2026

చిన్న నీటిపారుదల వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డికి రైతు సంక్షేమ కమిషన్ నివేదిక సమర్పణ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,ఆగస్టు 29: తెలంగాణ రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేయడం, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక యూనిట్లతో దాన్ని తిరిగి ఏర్పాటు చేయడంపై వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి నివేదిక అందించింది. కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి నేతృత్వంలో సభ్యులు రాములు నాయక్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, గంగాధర్, ఎం. భవానీరెడ్డి జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను కలిసి నివేదికలోని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పంటల మార్పిడి, ఉద్యానవన పంటల సాగు పెంపు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్‌పీఓ) ఏర్పాటుపై మరింత దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కమిషన్‌కు సూచించారు.రాష్ట్రంలో నీటి భద్రత, వ్యవసాయ స్థిరీకరణ, గ్రామీణ జీవనోపాధుల అభివృద్ధికి చెరువుల పునరుద్ధరణ అత్యంత అవసరమని నివేదికలో కమిషన్ స్పష్టం చేసింది. చిన్న, పెద్ద నీటిపారుదల వనరులను కలిపే కమాండ్ ఏరియా ఆధారిత నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు, చెరువుల పరిరక్షణకు ప్రత్యేకంగా ‘చిన్న నీటిపారుదల చట్టం’ రూపొందించాలని ప్రతిపాదించింది. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) సరిహద్దులను తక్షణమే గుర్తించి, ఆక్రమణలను తొలగించి వాటిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరింది. గత రెండేళ్లలో కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వానికి అందించిన సూచనలను ప్రతినిధి బృందం వివరిచగా, కమిషన్ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor