హైదరాబాద్,వి90న్యూస్,ఆగస్టు 31: హైదరాబాద్‌లోని మూసీ నదిపై అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో నూతనంగా నిర్మించిన ముసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి బ్రిడ్జిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణ పనులు, ప్రాజెక్టు విశేషాలకు సంబంధించి అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.

400 మీటర్ల పొడవు కలిగిన ఈ ముసారాంబాగ్ బ్రిడ్జిని దాదాపు రూ. 52 కోట్ల వ్యయంతో నిర్మించడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వీ. హనుమంతరావు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, అసదుద్దీన్ ఓవైసీ, శాసనసభ్యులు కాలేరు వెంకటేష్, మల్‌రెడ్డి రంగారెడ్డి, శ్రీగణేష్, నవీన్ యాదవ్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
